కుటుంబ పోషణ భారంగా మారింది

గుంటూరు:‘నా భర్త ఏడాది క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా అందాల్సిన పరిహారం ఇప్పటివరకు అందలేదు. నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ భారంగా మారింది’ అని గొట్టిపాడు గ్రామానికి చెందిన తుమ్మరగుంట ప్రసన్న జననేత వైయ‌స్‌ జగన్‌ను ప్రజాసంకల్పయాత్రలో కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ జననేతను వేడుకున్నారు.
Back to Top