ఆడవాళ్లన్న కనికరం లేకుండా దౌర్జన్యాలకు దిగుతున్నారు


క‌ర్నూలు: :  ‘జగనన్నా తెలుగుదేశం వాళ్లు కక్ష్య గట్టి నా మొగు డు బాయకాటి నల్లన్నను చంపేశారు. మా కుటుం బ సభ్యులపై తెలుగుదేశ‌మోళ్లు కక్ష్య గట్టారు. చంపుతామని బెదిరిస్తున్నారు. ఆడవాళ్లన్న కనికరం లేకుండా దౌర్జన్యాలకు దిగుతున్నారు.  మా బంధువులు మద్దిలేటి, తిమ్మగురుడు, చిన్న రాముడుని చంపాలని తిరుగుతున్నారు. మీరైనా మా గోడు విని పోలీసుల నుంచి రక్షణ కల్పించేలా చూడండి’ అని సి.బెళగల్‌కు చెందిన దస్తగీరమ్మ వెంకటగిరిలో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద మొరపెట్టుకుంది. ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ‘మీ కుటుంబానికి అండగా ఉంటా. టీడీపీ వాళ్ల దౌర్జన్యాలకు గురవుతున్న వారందరినీ నా కుటుంబ సభ్యులుగా రక్షించుకునే బాధ్యత నాది. పోలీసులతో మాట్లాడి మీ జోలికి రాకుండా చూస్తాను. ఏడాది పాటు ఓపిక పట్టండి . ఐక్యంగా మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం’ అని ఆమెకు భరోసా ఇచ్చారు.  


Back to Top