జ‌న‌నేత‌ను క‌లుసుకోవ‌డానికి..

నెల్లూరు: ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం రేనమాలలో ఈరోజు వైయ‌స్ జ‌గ‌న్ మ‌హిళ‌ల‌తో స‌మావేశ‌మ‌వుతార‌ని తెలుసుకున్న ఓ మ‌హిళ జ‌న‌నేత‌ను క‌ల‌వ‌డానికి చిత్తూరు జిల్లా నుంచి వ‌చ్చింది. పాద‌యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకుంది. త‌న భ‌ర్త అనారోగ్యంతో ఉన్నార‌ని, త‌న కూతురిని కూడా పోషించుకోలేని ప‌రిస్థితుల్లో ఉన్నాన‌ని, త‌న‌కు ఏదైనా స‌హాయం చేయాల‌ని కోరింది. దీనికి స్పందించిన వైయ‌స్ జ‌గ‌న్ ఆ మ‌హిళ‌కు స‌హాయం చేయ‌మ‌ని ఎమ్మెల్యే గౌతం రెడ్డిని ఆదేశించారు. 
Back to Top