ఎవ‌రు నువ్వు?

అస‌లు ఎవ‌రు నువ్వు?  నువ్వు ఏమైనా వాళ్ల ర‌క్త సంబంధ‌మా?  వాళ్ల బంధువువా? ? క‌నీసం ముఖ‌ప‌రిచ‌య‌మైనా ఉందా? కాదే? మ‌రి ఎందుకు వాళ్లు నిన్ను అంత‌గా అభిమానిస్తున్నారు. ఒకామె జెండా ప‌ట్టుకుని కేరింత‌లు కొడుతూ జై జ‌గ‌న్‌.. జైజై జ‌గ‌న్ అంటుంది. వాళ్ల కొడుకు ప్ర‌యోజ‌కుడు అయిన‌ప్పుడు కూడా అంత ఆనంద‌ప‌డుతుందో లేదో  తెలియ‌దు కానీ.. నువ్వు వ‌స్తున్నావంటే ఎందుకు ఆమెకు అంత ఆనందం?


ఒక ముస‌లావిడ నిన్ను చూడ‌డానికి ఎన్ని గంట‌లైనా ఎందుకు అలా ఎదురుచూస్తూ నిల‌బ‌డుకుంటోంది? ఆ జ‌నంలో వెళ్ల‌లేన‌ని తెలిసి కూడా నిన్నుచూడ‌డానికి ఎందుకు అంత ఆశ‌గా ఎదురు చూస్తోంది..? బాగ‌న్నావా అవ్వా అంటే ఎందుకు అంత మురిసి పోతుంది.?

ఒక అంధ‌త్వం క‌లిగిన వ్య‌క్తి నీకు తోడుగా ఎందుకు న‌డ‌వాలనుకుంటున్నాడు..? కిక్కిరిసిన జ‌నంలోనూ ఆ సాహ‌సం ఎందుకు చేస్తున్నాడు?

నువ్వు వ‌స్తున్నావంటే ఊర్ల‌ల్లో పండుగ వాతావ‌ర‌ణం ఎందుకు నెల‌కుంటోంది? జ‌నం ఎందుకు సంబ‌రాలు చేసుకుంటున్నారు? ముగ్గులు వేసి  గొబ్బిళ్లు ఎందుకు పెడుతున్నారు? 

వాళ్లు ఏమైనా ఆశిస్తున్నారా? 

నీ నుంచి ఏమైనా కోరుకుంటున్నారా? అంటే ఖ‌చ్చితంగా అవున‌నే అనిపిస్తోంది. 

నువ్వు అంటే ఓ న‌మ్మ‌కం. నువ్వు వ‌స్తున్నావంటే వాళ్ల‌కు ఓ ధైర్యం. 

నువ్వు ఏదైనా హామీ ఇస్తే అది క‌చ్చితంగా చేసి తీరుతావ‌నీ...

రాజ‌న్న బిడ్డ‌గా..  చెప్పిన‌వి, చెప్ప‌న‌వి కూడా చేసి చూపిస్తావ‌నీ..
మాట తప్పవనీ...మడమ తిప్పవనీ..
వాళ్ల క‌ష్టాలు తీరుస్తావ‌ని.. వాళ్ల క‌న్నీళ్లు తుడుస్తావ‌ని వారి ఆశ‌. 

అందుకే నీకోసం.. నీ పాల‌న కోసం.. ఎదురు చూస్తోంది ప్ర‌జానీకం.

నువ్వు వాళ్ల వ‌ద్ద‌కు వ‌స్తున్నావంటే గ్రామాల్లో నెల‌కొంటోంది పండుగ వాతావ‌ర‌ణం. 

మ‌రి నువ్వు రాజ‌న్న బిడ్డ‌వు.. వాళ్ల న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌వు అన్న‌దే సామాన్యుడిగా నాకున్న న‌మ్మ‌కం.


తాజా వీడియోలు

Back to Top