వెదురు కుప్పంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి

చిత్తూరు: వెదురుకుప్పం మండలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు వైయస్‌ జగన్‌కు కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం వైయస్‌ జగ న్‌ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు లేవు..రోడ్లు ఏర్పాటు చేయలేదని వెదురుకుప్పం గ్రామస్తులు తెలిపారు. ఉద్యోగ భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. వెదురుకుప్పంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.
 
Back to Top