ఇంట్లో ఖాళీగా ఉండలేక..

నెల్లూరు:  కష్టపడి బీటెక్‌ చదివా.. తగిన ఉద్యోగం లేదని నాయుడుపేటకు చెందిన వీ ముకేష్‌ గురువారం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. నాయుడుపేట నుంచి తుమ్మూరు మీదుగా ఓజిలి మండలంలో ప్రవేశించిన వైయ‌స్‌ జగన్‌ను మార్గం మధ్యంలో స్వర్ణముఖినది వంతెన వద్ద ముకేష్‌ కలిసి తన కష్టాలు వివరించారు. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో నిరుద్యోగులకు కష్టాలు వచ్చాయన్నారు. ఇంట్లో ఖాళీగా ఉండలేక ప్రైవేట్‌ ఫ్యాక్టరీలో తక్కువ జీతానికి పనిచేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయి నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జననేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు.

Back to Top