<br/>కర్నూలు : ‘కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం చంద్రబాబు ఒకవైపు చెబుతూనే మరో పక్క ఔట్‌సోర్సింగ్ విధానాన్ని తీసుకువస్తున్నార’ని సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు.. వైయస్ జగన్ ఎదుట ఆవేదన చెందారు. కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఈ సర్కార్‌కు కనికరం లేదని మండిపడ్డారు. మీరే మమ్మల్ని ఆదుకోవాలని జననేత ముందు తమ గోడు వెల్లబోసుకున్నారు.అలాగే విద్యుత్ సబ్‌స్టేషన్లలో పదేళ్ల నుంచి కాంట్రాక్ట్ బేసిక్ కింద ఆపరేటర్లుగా చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నా ప్రభుత్వం జీతాలు పెంచడం లేదని పలువురు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు.. వైయస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. <br/>