గిరిజ‌న గ్రామాల్లో రోడ్డు లేద‌న్నా...


-చంద్ర‌బాబు, లోకేశ్‌కు మొర‌పెట్టుకున్నప‌ట్టించుకోలేదు...
-వైయ‌స్ జ‌గ‌న్‌కు  విన్న‌వించుకున్న ఆలిమ‌య్య‌పాలెం గిరిజ‌నులు
గిరిజ‌న సంక్షేమం కోసం కోట్ల రూపాయలు ఇస్తున్న‌ట్లు కేంద్ర‌, రాష్ర్ట ప్ర‌భుత్వాలు చెప్ప‌కోవ‌డమే త‌ప్ప  గిరిజ‌న  గ్రామాల్లో ఆరోగ్య‌, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు జ‌ర‌గ‌డంలేదు.  గ్రామంలో నుంచి రోడ్డు మీద‌కు రావాలంటే సుమారు 5 కిలోమీట‌ర్లు రావాల్సివ‌స్తుంద‌ని  రోడ్డు మార్గం లేక‌పోవ‌డంతో తీవ్ర‌ అవ‌స్థ‌లు ఎదుర్కొంటున్నామ‌ని కోట‌వుర‌ట్ల మండ‌లం ఆలిమయ్య‌పాలెం గిరిజ‌నులు  వైయ‌స్ జ‌గ‌న్‌కు త‌మ గోడు వినిపించుకున్నారు. త‌ప్ప‌నిస‌రిగా రోడ్డు సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని  జ‌గ‌న్ హ‌మీ ఇచ్చిన‌ట్లు గ్రామ‌స్తులు తెలిపారు.  రోగుల‌ను, గ‌ర్భిణుల‌ను ఆసుప్ర‌తులో చేర్పించాలంటే డోలిలు క‌ట్టుకుని త‌ర‌లించాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు,లోకేశ్‌కు మొర పెట్టుకున్న త‌మ స‌మ‌స్య తీర‌లేద‌న్నారు.
Back to Top