బాబొచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ లేదు


వైయస్‌ జగన్‌ను కలిసిన విద్యార్థులు
విశాఖ: బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు మోసం చేశారని విద్యార్థులు మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క నోటిఫికేషన్‌ కూడా రాలేదని, ప్రైవేట్‌ ఉద్యోగాలు కూడా లేకుండా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. స్కాలర్‌షిప్‌లు కూడా రావడం లేదని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్రలో విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ప్రత్యేక హోదా తీసుకురావాలని వారు కోరారు.  వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే ఉద్యోగాలు వస్తాయని యువత ధీమా వ్యక్తం చేశారు.
 
Back to Top