ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావడం లేదన్నా..

–వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్న వైద్య విద్యార్థులు
విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో పలువురు విద్యార్థులు యండపల్లి వద్ద జననేత వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావడం లేదని  జననేతకు ఫిర్యాదు చేశారు. గతేడాదికి సంబంధించిన ఫీజులు అందకపోవడంతో తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తుందని వాపోయారు. మెడికల్‌ సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు . వారి సమస్యలు సావధానంగా వైయస్‌ జగన్‌ మరో ఏడాది ఓపిక పడితే చదువులకు అయ్యే ఫీజులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని భరోసా కల్పించారు.
 
Back to Top