అసలుతో సహా కట్టాల్సిందే అంటున్నారు

చిత్తూరు:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్  రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో బ్యాంక్‌కు వెళితే ఎంతో గౌరవం దక్కేది. అడిగినంత రుణం ఇచ్చేవారు. ఇప్పుడు బ్యాంక్‌ అధికారులు చిన్నచూపు చూస్తున్నారు’ అంటూ వడమాలకు చెందిన శ్రీధనలక్ష్మి మహిళా గ్రూపు సభ్యులు పాదయాత్రలో జననేతను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పసుపు, కుంకుమ పేరిట మూడో విడత డబ్బులు ఇంకా మంజూరు చేయలేదన్నారు. తీసుకున్న రుణాలకు వడ్డీ కూడా మాఫీ కాలేదని, అసలుతో సహా కట్టాల్సిందేనని బ్యాంక్‌ అధికారులు చెబుతున్నారని వాపోయారు.      
Back to Top