ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి

నెల్లూరు: నష్టాల్లో ఉన్న ఆర్టీసీ రంగాన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌ నెల్లూరు రీజియన్‌ నాయకులు పార్టీ అ«ధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గురువారం యూనియన్‌ నాయకులు పొదలకూరు మండలం ఉప్పుటూరు క్రాస్‌ రోడ్డు సమీపంలో జననేతను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నియంతృత్వ పోకడలు, ఏకపక్ష నిర్ణయాలే ఆర్టీసీ నష్టాలకు కారణమన్నారు. ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు యూనియన్‌ చేపడుతున్న కార్యక్రమాలను వారు జననేతకు వివరించారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్‌ రీజినల్‌ అధ్యక్షుడు పీవీ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఎస్‌ రమేష్‌బాబు, ఎస్‌కే రియాజ్, కార్యదర్శి ఎం.రాంబాబు, సంయుక్త కార్యదర్శులు సీహెచ్‌ సుబ్రహ్మణ్యం, టి.రామరాజు, సహాయ కార్యదర్శులు ఐ.హనుమంతరావు, కె. జనార్దన్‌రెడ్డి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సీహెచ్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 
 
Back to Top