వైయ‌స్ఆర్ మరణానంతరం పట్టించుకునే వారే కరువయ్యారు


కృష్ణాజిల్లా :  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణాంత‌రం త‌మ‌ను ప‌ట్టించుకునే వారే క‌రువ‌య్యార‌ని ఆర్ఎంపీ వైద్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రా ష్ట్రంలోని గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి పారా మెడిక్స్‌గా గుర్తింపు ఇవ్వాలని కైకలూరు గ్రామీణ వైద్యుల సంఘం ప్రతినిధులు ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న జననేత వైయ‌స్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. లింగాల వద్ద సంఘ ప్రతినిధులు పి.శ్రీధర్, ఎంవీ రమణారావు ఎన్‌.గంగయ్య, విజయకుమార్ వైయ‌స్‌ జగన్‌ను కలిశారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, మాకు వైద్య కళాశాలల్లో వెయ్యి గంటల శిక్షణ ఇచ్చి పారా మెడిక్స్‌గా గుర్తింపు ఇచ్చేందుకు జీవో సైతం విడుదల చేశారని గుర్తుచేశారు. శిక్షణ కోసం రూ.5 కోట్లు కేటాయించారని జననేత దృష్టికి తీసుకువచ్చారు.   ఇటీవల తమ ఒత్తిడి మేరకు ప్రస్తుతం ప్రభుత్వం జీవీ విడుదల చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే తమకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు.
Back to Top