ఆర్‌ఎంపీల వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసేందుకు ప్ర‌య‌త్నం

గుంటూరు :దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్‌ఎంపీలకు ప్రభుత్వ గుర్తింపు కల్పించేందుకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శిక్షణ కార్యక్రమం నిలిపివేశారు. ఆర్‌ఎంపీల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని గుంటూరు వైద్యవిభాగం కాంపౌండర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు ప్రజాసంకల్పయాత్రలో వైయ‌స్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు తెలిపారు. తమ ప్రభుత్వంలో ఆర్‌ఎంపీలకు శిక్షణ కార్యక్రమాలను తిరిగి పునరుద్ధరించాలని వారు వైయ‌స్ జగన్‌ను కోరారు.   

Back to Top