రేషన్‌కార్డు ఇవ్వడం లేదు: బాషా

కర్నూలు: నా పేరు బాషా, మాది కర్నూలు జిల్లా చాగలమ్రరి గ్రామం. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో నాకు రేషన్‌కార్డు ఇచ్చారు. అయితే చంద్రబాబు వచ్చాక ఆన్‌లైన్‌ పేరుతో కార్డు తీసుకొన్నారు. ఇంతవరకు ఆన్‌లైన్‌ చేయలేదు. దీంతో నాకు రేషన్‌కార్డు లేక బియ్యం, సరుకులు ఇవ్వడం లేదు. పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం లేదు. నాకు ప్రమాదంలో కాలు విరిగింది. వైద్యం చేయించుకుందామంటే ఆరోగ్యశ్రీ కార్డు లేదు. ఈ విషయాన్ని వైయస్‌ జగనన్న దృష్టికి తీసుకెళ్లాను. ఏడాది ఓపిక పట్టమని చెప్పాడు.  
Back to Top