ప్రజా సంకల్పయాత్ర ఏర్పాట్లు పరిశీలన

ఎర్రగుంట్ల:  ఈ నెల 6 నుంచి వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్ట బోయే ప్రజా సంకల్పయాత్రకు సంబంధించి ఎర్రగుంట్లలో రెండు రోజులు పాటు జరిగే యాత్ర ఏర్పాట్లును  పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జీ డాక్టరు ఎంసుధీర్‌రెడ్డి పరిశీలించారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి వేంపల్లి రోడ్డులోని పాదయాత్ర రూట్‌ను ఏర్పాట్లుకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 9,11 తేదిలలో నియోజ‌క‌వ‌ర్గంలో సాగుతుందన్నారు. రాత్రి విడిది కూడా ఏర్పాటుపై పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. పాదయాత్రకు వస్తున్న కార్యకర్తలకు భోజన సదుపాయంను కావాల్సిన స్థల పరిశీలన చేశామ‌న్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ డీ సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు సురేంద్రనా«ద్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌రెడ్డి, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహుబూబ్‌వలి, ముద్దనూరు మండల కన్వీననర్‌ శ్రీనా«ద్‌రెడ్డి, పార్టీ నాయకులు మల్లు గోపాల్‌రెడ్డి, రఘునందన్‌రెడ్డి, పెద్దనపాడు సాంబశివారెడ్డి ,పోట్లదుర్తి సుధాకర్‌రెడ్డి,, ప్రతాప్‌రెడ్డి, చిలంకూరు రామాంజనేయురెడ్డి, హనుమనుగుత్తి చెంచురెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Back to Top