ఆపరేషన్‌ చేయించే స్థోమత లేదు

చిత్తూరు: ‘అన్నా..! మాకు ఇద్దరు పిల్లలు. మేనరికం చేసుకున్నాం. పెద్దోడికి పదేళ్లు. పాపకు తొమ్మిదేళ్లు. ఇద్దరికీ మాటలు రావు. చెవులు వినిపించట్లేదు. ఆపరేషన్‌ చేయిద్దామంటే అంత స్థోమత లేదు..’ అంటూ తుమ్మలచెరువు అగ్రహారానికి చెందిన శాంతి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా సంకల్పయాత్రలో జననేతను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. భర్త కూలి చేస్తుంటాడని తెలిపారు. పిల్లలకు ఆరేళ్ల పాటు ప్రత్యేక బధిరుల పాఠశాలలో చదువులు చెప్పించి, ఇప్పుడు మామూలు పాఠశాలలో చేర్పించామన్నారు. ఆపరేషన్‌ చేస్తే ఇద్దరు పిల్లలకు మాటలు రావడంతోపాటు వినికిడి అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారన్నారు. ఖరీదైన వైద్యం చేయించే స్థోమత లేక అల్లాడుతున్నామన్నారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ పిల్లలు ఇద్దరికీ వైద్య పరీక్షలు చేయించి శస్త్రచికిత్సల అవసరాన్ని తనకు తెలియజేయాలని సిబ్బందిని ఆదేశించారు.     
 

Back to Top