బాబూ సర్కార్‌ నష్టం పరిహారం చెల్లించడం లేదు..


జగన్‌ను కలిసిన పోలవరం ఎడమకాల్వ భూ నిర్వాసితులు
విశాఖ‌: జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన పోలవరం ఎడమకాల్వ పనులు నత్తనడకన సాగుతున్నాయని పాదయాత్రలో  విశాఖ జిల్లా పాయకరరావు పేట నియోజకవర్గ వాసులు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. పోలవరం ఎడమకాల్వలో భూములు కోల్పోయిన నిర్వాసితులు వైయ‌స్ జగన్‌ను కలుసుకున్నారు. భూములు కోల్పోయిన తమకు టీడీపీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని వాపోయారు. తమకు న్యాయం జ‌రిగేలా చూడాల‌ని వారు కోరారు. 
Back to Top