కరెంటు ఎప్పుడు వస్తుందో..పోతుందో తెలియడం లేదు


అనంతపురం: వ్యవసాయానికి కరెంటు ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియడం లేదని అన్నదాతలు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. పరజా సంకల్ప యాత్రలో రైతులు వైయస్‌ జగన్‌కు కలిశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదని, రుణాలు మాఫీ కాలేదని, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని మహిళలు తెలిపారు. రుణాలు మాఫీ చేయాలని మహిళలు వైయస్‌ జగన్‌కు కోరారు. మరో వృద్ధురాలు తమకు బియ్యం వేయడం లేదని, పింఛన్‌ రావడం లేదని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వీరి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ వారికి ధైర్యం చెప్పారు.
 
Back to Top