గ్రామాల‌ విలీనంతో ఉపాధికి దూరం

విశాఖ‌: యలమంచిలి నగర పంచాయతీలో గ్రామ పంచాయతీలను విలీనం చేయడంతో  ఏడు గ్రామాల ప్రజలు ఉపాధి హామీ పనులు లేకుండా పోయాయని నగర పంచాయతీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలు జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గురువారం వైయ‌స్‌ జగన్‌ను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. అభివృద్ధి లేకపోయిన పన్నుల భారంతో నడ్డి విరగగొడుతున్నారని వాపోయారు.గ్రామీణ ప్రాంతాల్లో బంజారుభూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయని, కొందరు టీడీపీ నేతలు భూముల్ని తక్కువ ధరకు వారి అనుచరులకే కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.  
Back to Top