ఏడుకొండలుకు పెన్షన్‌ ఇప్పించండి

సైదాపురం: అన్ని అర్హతలు ఉన్నా తన కుమారుడికి పెన్షన్‌ ఇవ్వడం లేదని వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం అనంతగోడు గ్రామానికి చెందిన కృష్ణయ్య, సుమతిలు జననేతకు మొరపెట్టుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా అనంతగోడుకు వచ్చిన వైయస్‌ జగన్‌ను కలిసి ఆ దంపతులు వారి బాధ చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. తమ ఆరేళ్ల కుమారుడు ఏడుకొండలు కూర్చోలేడు.. నిలబడలేడు.. పెన్షన్‌ కోసం అధికారుల చుట్టూ తిరిగినా అందించడం లేదు. సర్టిఫికెట్‌ తీసుకువస్తే పెన్షన్‌ ఇస్తామన్నారు. సర్టిఫికెట్‌ ఇచ్చినా నాలుగు నెలల నుంచి తిప్పుతున్నారు. కూలిపని చేసుకుంటూ బతుకుతాం.. ఏడుకొండలును అన్ని ఆస్పత్రులు తిప్పాం. అయినా నయం కాలేదు. వైయస్‌ జగన్‌కు బాధ చెప్పడంతో ఆయన స్పందించి మన ప్రభుత్వం రాగానే ఏడుకొండలుకు రూ. 3 వేల పెన్షన్‌ వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారన్నారు.

తాజా ఫోటోలు

Back to Top