జ‌గ‌న‌న్న రావాలి...మా స‌మ‌స్య‌లు తీరాలి...

జోరువాన‌లో కూడా  వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర సాగుతోంది.  విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు వింటూ.. వారికి భ‌రోసా ఇస్తూ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. విద్యార్థులు, విక‌లాంగులు,రైతులు త‌మ గోడును వినిపించారు.  ఇళ్లు లేవంటూ నిరుపేద‌లు, పింఛ‌న్లు రావ‌డంలేదంటూ అభాగ్యులు, జ‌న్మ‌క‌మిటీలు ఆజ్ఞ లేనిదే లోన్లు కూడా ఇవ్వ‌డంలేదంటూ మ‌రికొంద‌రు ఇలా ఎన్నో స‌మ‌స్య‌ల‌ను వైఎస్ జ‌గ‌న్ దృష్టికి తీసుకొస్తున్నారు. త‌మ స‌మ‌స్య‌లు తీరాలంటే జ‌గ‌న‌న్న రావాలంటున్నారు.
Back to Top