డెలవరీకి వెళ్తే రెండు కిడ్నీలు పాడయ్యాయి

వైయస్‌ జగన్‌ను కలిసి కన్నీరుపెట్టుకున్న దంపతులు
తూర్పుగోదావరి: ప్రసవం కోసం తుని ఆస్పత్రిలో చేరితో వైద్యుల నిర్లక్ష్యంతో రెండు కిడ్నీలు పాడయ్యాయని కేఈ చెన్నాయిపాలెంకు చెందిన చింతల నాగేశ్వర్‌రావు, శివకుమారి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ గోడు చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు. తమ లాంటి సమస్య ఇంకొకరికి రావొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య ఖర్చులకు సాయం చేసి ఆదుకోవాలని  వైయస్‌ జగన్‌ను కోరారు.  
Back to Top