దొన‌కొండ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు

ప్ర‌కాశం: తెలుగుదేశం ప్రభుత్వం దొన‌కొండ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని జిల్లా వాసులు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్ర‌భుత్వం అభివృద్ధికి ఆటంకంగా మారి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రానీయకుండా చేస్తుంది. అందుకే ప్రత్యేక హోదా, పరిశ్రమలు రావడంలేదని దొనకొండకు చెందిన బొమ్మిరెడ్డి బ్రహ్మారెడ్డి వైయ‌స్‌ జగన్‌ను కలసి విన్నవించారు. ప్రకాశం జిల్లా వెనుకబడి ఉందని దొనకొండలో పరిశ్రమలు ఏర్పాటు అని చెప్పిమరలా పట్టించుకోవడం లేదని తెలిపారు. జిల్లా అభివృద్ధి జరిగేలా చూడాలని విన్నవించారు. 
Back to Top