మీరూ మీ నాన్నలాగే మా క్షేమం తలచండయ్యా


క‌ర్నూలు:   దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా చెర‌గ‌ని ముద్ర వేసుకున్నార‌ని మ‌రోమారు రుజువైంది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా మ‌హానేత అభిమానులు జ‌న‌నేత‌ను క‌లిసి మ‌హానేత చేసిన మేలుల‌ను గుర్తు చేసుకుంటున్నారు. ‘మీ నాన్న దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి  గొర్రెలకు బీమా పథకం వర్తింపజేశారు. గొర్రెలకు వ్యాధులొస్తే ప్రభు త్వ పశు వైద్యశాలలో ఉచితంగా మందులు అందుబాటులో ఉంచారు. కానీ ఇప్పుడు గొర్రెల బీమా పథకాలకు మంగళం పాడారు. మీరూ మీ నాన్నలాగే మా క్షేమం తలచండయ్యా’ అని చెరుకులపాడుకు చెందిన గొర్రెల కాపరులు వైయ‌స్‌ జగన్‌కు వినతిపత్రం ఇచ్చారు. తమకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణాలివ్వాలని కోరారు. మన ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా న్యాయం చేస్తానని వైయ‌స్‌ భరోసా ఇచ్చారు. అనంతరం కాపరులు జననేత భుజంపై గొంగళి వేసి, గొర్రెపిల్లను బహూకరించారు.


Back to Top