ఊరూరా స‌మ‌స్య‌లే

అనంత‌పురం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్వ‌హిస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల‌తో స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఏ ఊరికి వెళ్లినా కూడా త‌మ‌కు పింఛ‌న్లు రావ‌డం లేద‌ని, ఫీజులు అంద‌డం లేద‌ని, రుణాలు మాఫీ కాలేద‌ని, నీళ్లు లేవు, పంట‌లు పండ‌టం లేదు..ఇలా స‌మ‌స్య‌లు వైయ‌స్ జ‌గ‌న్ ముందు అనంత‌పురం జిల్లా ప్ర‌జ‌లు ఏక‌రువు పెడుతున్నారు.
1 మా ఓట్లతో బతుకుతున్నాడు చంద్రబాబు. మమ్మల్ని మాత్రం అన్యాయం చేసాడు అంటూ బాబు పాలనపై నిప్పులు చెరిగారు మహిళలు. బాబు చేసే మోసాన్ని నలుగురికీ చెప్పాలని ప్రతిపక్ష నేత కోరగా చెబుతాము సామీ తప్పకుండా చెబుతాము...ఇంకెప్పుడూ మోసపోకూడదని కూడా చెబుతాము అంటూ ఉద్వేగానికి లోనయ్యారు అనంతపురం మహిళలు. 
2 ముస్లింలు ఎక్కడైనా మైనారటీలుగా ఉండిపోయారు. ఏదీ జరగడం లేదు అంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ముందు తన ఆవేదనను వెళ్లగక్కిందో ముస్లిం ఆడపడుచు. ఇద్దరు బిడ్డలను కోల్పోయి న్యాయం కోసం తిరిగినా కలెక్టరు, సిఎమ్ రిలీఫ్ ఫండ్ అన్నారు కానీ ఏ హామీ నెరవేర్చలేదని కన్నీళ్ల పర్యంతం అయ్యిందామె.  ఇళ్లకొచ్చి హామీలు ఇచ్చిన టిడిపి నాయకులు మళ్లీ కనబడలేదని, సరైన ఆసుపత్రులూ, వైద్యం ఉంటే, ఆరోగ్యశ్రీ ని హైదరాబాద్ లో కూడా చేయించుకునే అవకాశం ఇచ్చుంటే మా బిడ్డలు బతికేవారని కన్నీళ్లు పెట్టుకుందా కన్నతల్లి.  డబ్బులు లేక ఎందరో పిల్లలు చనిపోతున్నారని మీ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీని బాగు చేయాలని కోరింది. 
3 ఊళ్లో డెంగ్యూ ఉందని చెబితే అధికారులు, నాయకులు కలిసి అలాంటిదేం లేదని అన్నారని ప్రతిపక్ష నేత దృష్టికి తెచ్చారు ముదిగుబ్బ గ్రామస్తులు. మైనారిటీలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. 

4 ప్రజల గురించి పట్టించుకోని నాయకులు ఉంటే ఎంత లేకపోతే ఎంత సర్....అన్నాడో ముస్లిం యువకుడు. వైయస్ ఉన్నప్పుడు ప్రతి మైనారిటీ ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయి. ఇప్పుడు ముస్లింలకు ఏ పనీ జరగడం లేదని తమ బాధను ప్రతిపక్ష నేత ముందుంచాడు ఎమ్ ఎమ్ డియె సంఘం నుంచి వచ్చిన ఇమామ్. 


 

తాజా వీడియోలు

Back to Top