నాకు పింఛను వచ్చేలా చూడండన్నా

అనంత‌పురం: ‘నాపేరు భూలక్ష్మీ. ఈరన్నపల్లి మాది. నాభర్త ఆదెప్ప చనిపోయి ఏడాది అవుతోంది. వితంతు పింఛను కోసం ఇక్కడి అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. పలుమార్లు అనంతపురంలో గ్రీవెన్స్‌లో కూడా అధికారులకు సమస్యను తెలిపాను. కూలీ పనులకు వెళ్లి ఇద్దరు ఆడపిల్లలను పోషించుకుంటున్నాను. నాకు పింఛను వచ్చేలా చూడండన్నా’ అంటూ వైయ‌స్‌ జగన్‌ వద్ద వాపోయింది. ఏడాది ఓపిక పట్టాలని, మన ప్రభుత్వం వస్తే తప్పక న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Back to Top