పొగాకు రైతుల‌ను ఆదుకోవాలి

 
నెల్లూరు: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని  వైయ‌స్ఆర్‌ సీపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులురెడ్డి  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో ఉన్న బ్యారెల్‌ ధరకు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. కలిగిరిలో ఎంతో మంది రైతులు పొగాకు సాగుపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు.


Back to Top