మా భూమి లాగేసుకున్నారు

ప‌శ్చిమ గోదావ‌రి: అన్నా నాకు మిలట్రీ కోటాలో ఐదెకరాలు భూ మి కేటాయించినట్టు పాస్‌బుక్‌ కూడా ఇచ్చా రు. ఆ భూమి ఎక్కడ ఉందో చూపించమని అడిగినా చూపించలేదు. ఏడాది క్రితం నాకు ఇచ్చిన భూమిని ప్రభుత్వానికి అవసరమైం దని మీ భూమికి సంబంధించిన నగదును అకౌంట్‌లో వేస్తామని చెప్పి అధికారులు పాస్‌బుక్, నా ఖాతా నంబర్‌ ఇమ్మని తీసుకున్నారు. ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు. తిరగలేకపోతున్నాను అంటూ.. కొవ్వూరుకు చెందిన కడలి భాస్కరరావు జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.
Back to Top