వైయస్‌ఆర్‌ వల్లే నా ప్రాణం నిలిచింది

వైయస్‌ జగన్‌తోనే ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం
పశ్చిమగోదావరి: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన ఆరోగ్యశ్రీ వల్లే తన ప్రాణం నిలిచిందని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన షేక్‌ అలీ అన్నారు. వైయస్‌ఆర్‌ చేసిన మేలు మర్చిపోని అతను ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా సమస్యలపై వినతిపత్రం అందజేశారు. తొమ్మిదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డానని, రెండుకాళ్లు కోల్పోయి.. కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. వైద్యం చేయించుకోవడానికి డబ్బులు కూడా లేని సమయంలో మహానేత వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ తన ప్రాణాలను కాపాడిందన్నారు. మళ్లీ ఆరోగ్యశ్రీ వస్తే తనలాంటి ఎంతోమంది నిరుపేదల జీవితాలు బాగుపడతాయన్నారు. వైయస్‌ఆర్‌ దయవల్లే తన కూతురు ఎంబీబీఎస్‌ చదువుతోందని షేక్‌ అలీ చెప్పారు. 
ట్రైసైకిళ్లు కూడా పంపిణీ చేయలేని దుస్థితి
చంద్రబాబు పాలనలో దివ్యాంగులకు కనీసం ట్రైసైకిళ్లు కూడా పంపిణీ చేయలేదని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు వెహికిల్‌ ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు సైకిల్‌ ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తున్నాడన్నారు. దరఖాస్తు చేసుకుంటే పదో తరగతి సర్టిఫికెట్, బ్యాంక్‌లోన్, ఇన్‌కం సర్టిఫికెట్‌ అడుగుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం రావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. జననేత ముఖ్యమంత్రి అయితే తనలాంటి ఎంతోమంది దివ్యాంగులకు మేలు జరుగుతుందని చెప్పారు. తనకు వెహికిల్‌ ఇప్పించాలని కోరానని వివరించారు. 
 
Back to Top