తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులుపడుతున్నాం


కృష్ణా జిల్లా : ‘అన్నా.. మా గ్రామంలో తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులుపడుతున్నాం. మూడేళ్ల నుంచి మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోడం లేదు’ అంటూ గన్నవరం నియోజకవర్గం ఇందుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు,కోటేశ్వరమ్మ, శివపార్వతి,  జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయ‌స్‌ జగన్‌ను కలసి సమస్యలు విన్నవించారు. తాగునీటి కుళాయి, బోరింగ్‌ పంపులు రెండూ ఒకేచోట ఏర్పాటు చేయడం వల్ల  గ్రామంలో మిగిలిన ప్రదేశాలలో నివసించే వారు బిందెలు మోసుకుంటూ దూరం నుంచి నీళ్ల తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు.
Back to Top