పూటగడవటం లేదు

కృష్ణాజిల్లా : ‘అయ్యా.. మాది నిరుపేద కుటుంబం. నాలుగేళ్ల నుంచి వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయడం లేదు’ అని  గోపావారిగూడెంకు చెందిన బి. హనుమంతరావు ప్రజా సంకల్పయాత్రలో వైయ‌స్‌ జగన్‌ను కలిసి కన్నీరు పెట్టుకున్నారు.  వృద్ధాప్య పింఛన్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ జన్మభూమి, గ్రామసభల్లో అర్జీలు పెట్టుకున్నా ప్రయోజనం లేదని వాపోయారు. పింఛన్ల మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయని, తన లాంటి అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూటగడవక నానా అవస్థలు పడుతున్నానని, తనకు పింఛన్‌ వచ్చేలా చూడాలని జననేత వైయ‌స్‌ జగన్‌ను కోరారు.
Back to Top