కృష్ణ‌మ్మ చెంత నీటికి చింత

కృష్ణా జిల్లా :‘రాయలసీమకు సైతం నీళ్లుస్తున్నాం అంటూ నిత్యం గొప్పలు చెప్పే జలవనరుల శాఖామంత్రి ఇలాకాలోనే నీరు లేక అల్లాతున్నాం’ అంటూ కృష్ణా జిల్లా వాసులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప‌క్క‌నే కృష్ణా న‌ది ఉన్నా..నీటి క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. ఎడాపెడా ఇసుక త‌వ్వ‌కాలు చేప‌ట్ట‌డంతో భూగ‌ర్భ‌జ‌లాలు అడుగంటి పోయాయని ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట స్థానికులు తమ బాధలు చెప్పుకున్నారు. జి కొండూరు మండలం చెవుటూరులో  పది మందికి పైగా గొర్రెల పెంపకం దారులు ఉన్నారని, రెండు వేల వరకూ జీవాలు(గొర్రెలు) ఉన్నట్లు పశుపోషకుడు ఉమ్మడి వెంకటేశ్వరరావు తెలిపారు. పైగ్రామాల వారు కాలువలోకి నీరు రానివ్వకపోవడంతో మూగజీవాలు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, చేతిపంపుతో నీరు కొట్టి వాటికి పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. తమకు నీరందే విధంగా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని వారు జననేతను కోరారు.
Back to Top