దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలి

గుంటూరు :ప్రస్తుతం బీసీ–సీ జాబితాలో ఉన్న దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని నవ దళిత క్రైస్తవ పరిరక్షణ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ కొట్ల దిలీప్ కోరారు. ఈ మేర‌కు జననేత వైయ‌స్‌ జగన్‌ను కలిసి క్రైస్తవుల సమస్యలు వివరించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఈ అంశంపై సానుకూలంగా స్పందించినట్లు గుర్తు చేశారు. ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని కోరుతూ జగన్‌కు వినతిపత్రం అందించారు.


Back to Top