అందరికీ ఓటు హక్కు కల్పించేలా చూడాలి

గుంటూరు : ‘అయ్యా.. ఉద్దేశపూర్వకంగానే  నా పేరు ఓటర్ల జాబితాలో నుంచి  టీడీపీ నాయకులు తొలిగించారు’ అని అమృతలూరు మండలానికి చెందిన పాస్టర్‌ ఏలియా ప్రజా సంకల్పయాత్ర జననేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం  పార్టీ సీనియర్‌ సిటిజన్‌లని 55 ఏళ్లు పైబడిన వారి పేర్లను, అలాగే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఉన్న వారి పేర్లను ఓటరు జాబితాలో నుంచి తొలిగిస్తున్నారని తెలిపారు. అధికారులను ప్రశ్నించినా పట్టించుకోవడం లేదని జననేతకు వివరించారు. రానున్న ఎన్నికల్లో అందరికీ ఓటు హక్కు కల్పించేలా చూడాలని కోరారు.

తాజా ఫోటోలు

Back to Top