వ్యవసాయ కూలీలుగా మార్చాల్సి వచ్చింది


గుంటూరు : అక్షయగోల్డ్‌లో ఏజెంట్‌గా చేరి లక్షల రూపాయలు నష్టపోయాను. గ్రామంలో దాదాపు 90 మంది నుంచి రూ.15 లక్షల కట్టించాను. అక్షయగోల్డ్‌ కంపెనీ మూతపడిన తరువాత డబ్బు కట్టించిన వారు ఇంటిపైకి వచ్చి గొడవకు దిగారు. దీంతో నాభర్త తీవ్ర మనస్తాపానికి గురై మరణించారు. ఆయన మరణానంతరం డిపాజిట్‌దారుల ఒత్తిడితో చేసేదేమీ లేక ఉన్న ఎకరం పొలాన్ని అమ్మి డబ్బు చెల్లించాను. ప్రస్తుతం చదువుకునే నా ఇద్దరుపిల్లలకు ఎటువంటి ఆధారం లేకపోడంతో వ్యవసాయ కూలీలుగా మార్చాల్సి వచ్చింది’ అని సత్తెనపల్లి మండలం భృగుబండకు చెందిన ఇందూరి అరుణకుమారి వైయ‌స్‌ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా  చాగంటివారిపాలెం శివారుల్లో జననేతను కలిసి ఆమె తన సమస్యలు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వితంతు పింఛన్‌ ఇప్పిస్తానని జన్మభూమి కమిటీ సభ్యుడు రూ.5 వేలు తీసుకుని నేటికీ పింఛన్‌ ఇప్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

Back to Top