జీతాలు పెంచాలని విన‌తి

గుంటూరు:ప్రభుత్వ కాంట్రాక్ట్‌ కార్మికులకు అందిస్తున్న సౌకర్యాలను 108 సిబ్బందికీ అమలు చేయాలని వైయ‌స్ జగన్‌ను 108 కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రతినిధులు కోరారు.  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వైయ‌స్‌ జగన్‌ను 108 సిబ్బంది కలిశారు. 108ను నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలిపారు. వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి తమకు 8 గంటల పని విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.  ఇప్పుడు ఆ హామీ అటకెక్కిందన్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల వలే తమకు 50 శాతం జీతాలు పెంచాలని కోరారు. మండలానికి ఒక అంబులెన్స్‌ ఉండేలా చూడాలన్నారు.


Back to Top