మట్టి తవ్వి కోట్ల రూపాయలు దండుకున్నారు

గుంటూరు: చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ నాయకులు నీరుచెట్టు పేరుతో దళితుల భూములను ఆక్రమించుకుని అందులో మట్టి తవ్వి కోట్ల రూపాయలు దండుకున్నారని ఏపీ గిరిజన సంఘాల ఐఖ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనునాయక్‌ ప్రజాసంకల్పయాత్రలో  వైయ‌స్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. నియోజకవర్గంలో ఏలూరు, గొరిజవోలు, తూబాడు, యడ్లపాడు, బోయపాలెం, కొండవీడు, కొత్తపాలెం గ్రామాల్లో దళితుల భూములను టార్గెట్‌ చేసుకుని వ్యవసాయం చేయనీయకుండా సాగు భూములను లాక్కుని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు జీవనాధారం లేకుండా చేశారని ఆరోపించారు. అదేవిధంగా యడవల్లిలో దళితులకు చెందిన 416 ఎకరాల వ్యవసాయ భూమిలో గ్రానైట్‌ నిక్షేపాలున్నాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వారి వద్ద నుంచి లాక్కునేందుకు అనుమతులు తీసుకువచ్చారని చెప్పారు. తమ ఐక్యవేదిక ద్వారా సమస్యను లోకాయుక్తకు కూడా తీసుకువెళ్లామని వైయ‌స్‌ జగన్‌కు చెప్పారు. 


Back to Top