ఓబీసీ జాబితాలో చేర్చాలి

గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మంది జనాభా ఉన్న తూర్పు కాపులను ఓబీసీల్లోకి చేర్చి ఆదుకోవాలని గుంటూరు జిల్లా తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం సభ్యులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించారు.  దేశ వ్యాప్తంగా తూర్పు కాపు సీరియల్‌ నంబరు 90గా ఉంచినట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓబీసీలుగా పరిగణిస్తున్నారని, దీనిని మిగతా పది జిల్లాల్లో కూడా వర్తింపజేయాలని చెప్పారు. తూర్పు కాపుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు.
Back to Top