నాన్న‌పేరు నామకరణం

 గుంటూరు: పొన్నూరు మండలం చుండూరు పల్లెకు చెందిన సీహెచ్‌ అనూష కుమారుడికి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి త‌న తండ్రి పేరు నామకరణం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పొన్నూరు నియోజకవర్గానికి చేరుకున్న వైయ‌స్‌ జగన్‌ వద్దకు అనూష తన బిడ్డను తీసుకుని వచ్చి ‘జగనన్నా... నా బిడ్డకు నువ్వే నామకరణం చేయాలన్నా.. నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పారు. వైయ‌స్ జ‌గన్‌ చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకుని రాజశేఖర్‌ అని పేరుపెట్టారు.  తన బిడ్డకు మహానేత వైయ‌స్‌ఆర్‌ పేరు పెట్టడంతో ఆ తల్లి సంబరపడింది.
Back to Top