అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించలేం ..


ప్ర‌కాశం ‘నా కుమారుడు పి.కృపాసన్‌కు ఆరు సంవత్సరాలు. సంవత్సరం క్రితం జ్వరం తగలడంతో మూడు నెలలు వైద్యశాలల చుట్టూ తిరిగాం. ఆరు నెలల క్రితం పరీక్షలు నిర్వహించి బ్లడ్‌ క్యాన్సర్‌ అని చెప్పారు. ఆరు నెలలు కీమోథెరపీ చేయించాలని చెప్పడంతో రూ.5 వడ్డీకి రూ.3లక్షలు తెచ్చాం. మరో రూ.10లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పారు. కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునే తమకు అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించలేం సార్‌’ అని బాలుడి తల్లి జయ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తన సమస్యను చెప్పుకుంది.

Back to Top