వ‌డ్డీ మాత్ర‌మే మాఫీ అయ్యింది

 
ప్ర‌కాశం: ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకంలో మొదటి విడతగా రూ. 16,452 మాత్రమే వచ్చాయని మిగిలిన రుణం మాఫీ కాకపోవడంతో బ్యాంకర్లు తన ఆస్తులు వేలం వేస్తామని బెదిరిస్తున్నారని బండ్లమూడి గ్రామానికి చెందిన పెమ్మ శ్రీనివాసరావు వాపోయాడు. గతంలో రూ. 80 వేలు సొసైటీ బ్యాంకులో క్రాప్‌ లోన్‌ కింద తీసుకోగా  ప్రస్తుతం రూ. 1,10,000 అయిందని.. గతంలో వడ్డీ కింద రూ. 20 వేలే బ్యాంకులో జమ చేశారని చెప్పాడు. బ్యాంకర్లు నోటీసులు పంపుతూ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రుణమాఫీ పత్రాలిచ్చినా బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నానని విలపించాడు.
Back to Top