ప‌నికి త‌గ్గ వేత‌నం ఇవ్వ‌డం లేదు

నెల్లూరు: ‘సార్‌.. నిత్యం గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. ఆరోగ్య శాఖ ద్వారా గ్రామస్థాయిలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ మాతో పనులు చేయించుకుంటున్నారు. అందుకు తగ్గ వేతనం మాత్రం ఇవ్వడం లేదు. జీతం సరిపోక కుటుంబ జీవనం రోజురోజుకూ దుర్భరంగా మారుతోంది’ అంటూ ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. కనీస వేతనం రూ. 6 వేలు చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Back to Top