మద్యానికి బానిసై..


నెల్లూరు: ‘అన్నా.. బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించాం అని సీఎం చెబుతున్నా గ్రామాల్లో ఇప్పటికీ నడుస్తున్నాయి. మద్యానికి బానిసైన కొందరు రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బును ఆ షాపుల్లో ఖర్చు చేస్తున్నారు. తమ కుటుంబాలను అగాథంలోకి నెట్టేస్తున్నారు’ అని కలిచేడుకు చెందిన కమలకుమారి అనే మహిళ జననేతకు తెలిపింది. మీరైనా అధికారంలోకి వచ్చాక బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించాలని కోరింది. వైయ‌స్‌ జగన్‌ స్పందిస్తూ షాపులను పూర్తిగా నిర్మూలిస్తామని ఇప్పటికే ప్రకటించామని, అధికారంలోకి వచ్చాక తప్పకుండా అమలు చేస్తామని ఆమెకు హామీ ఇచ్చారు.

Back to Top