చేతిలో చిల్లి గవ్వలేదు

నెల్లూరు: నాయనా.. నా మనవరాలు లావణ్య (9)కు మాటలు రావు. చూపు కనిపించదు. ఆస్పత్రిలో చికిత్స చేయిద్దామంటే డబ్బు లేదు. ఈ విషయాలను స్థానిక పాలకులు, అధికారులకు చెప్పి సాయం చేయాలని కోరితే పదేపదే తిప్పించుకుంటున్నారు తప్ప పట్టించుకోవడం లేదు. నా మనవరాలి భవిష్యత్‌పై భయం వేస్తోందయ్యా. పెద్దాస్పత్రికి తీసుకెళ్లి చూపిద్దామంటే చేతిలో చిల్లి గవ్వలేదు. కూలీనాలీ చేసుకుని బతికేవాళ్లం. ఎలా డబ్బులు పెట్టి చూపించుకోవాలి’ అంటూ శిరసనంబేడుకు చెందిన దగ్గవోలు జ్ఞానమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వమే పట్టించుకోకపోతే మా లాంటి వాళ్ల పరిస్థితి ఏంటయ్యా అంటూ జననేత ఎదుట వాపోయింది.   

తాజా వీడియోలు

Back to Top