మా కుటుంబం వీధిన పడింది

నెల్లూరు:  ‘అయ్యా.. నా భర్త ఐదు మాసాల కిందట పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త మృతితో మా కుటుంబం వీధిన పడింది. కొందరు అధికార పార్టీ నాయకులు వచ్చి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి వెళ్లారు. ఇది జరిగి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సాయం అందలేదు. మీరే ఆదుకోవాలయ్యా’ అని శిరసనంబేడుకు చెందిన పెన్నా శ్యామలమ్మ వాపోయింది. కూలి పనులు చేసి ఇద్దరు బిడ్డలను పోషించడం చాలా కష్టంగా మారిందని జననేత ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది. 
Back to Top