రోజంతా కష్టపడుతున్నాం..

నెల్లూరు: గర్భిణులకు సేవలు, చిన్నారులకు టీకాలు, వైద్యాధికారులు చెప్పే పనులు చేస్తూ రోజంతా కష్టపడుతున్నా పనికి తగిన వేతనం అందడంలేదని పలువురు ఆశ వర్కర్లు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పీసీటీ కండ్రిగ, పునబాక, పీటీ కండ్రిగ, చెంబేడు, వడ్డిపాళెం, చెన్నప్పనాయుడుపేట గ్రామాల్లో ప్రజా సంకల్పయాత్ర చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు ఆశ వర్కర్లు తమ కష్టాలను విన్నవించారు. చెంబేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 ఏళ్లుగా సరైన వేతనాల్లేకుండా పని చేస్తున్నామని, గర్భిణులకు తొమ్మిది నెలలు సేవలు చేయడంతో పాటు కాన్పు సమయంలో రోజంతా కష్టపడుతూ, తల్లీబిడ్డ ప్రాణాలను కాపాడేందుకు నిత్యం శ్రమిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో కనీస వేతనాలను కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో నెలకు రూ.ఆరు వేలను చెల్లిస్తున్నారని తెలిపారు. స్పందించిన వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి రూ.ఏడు వేల గౌరవ వేతనం చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. ఆశ వర్కర్లు రమణమ్మ, కృష్ణమ్మ, సుకన్య, సుజాత, రామమ్మ, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Back to Top