ఇద్దరు బిడ్డలూ వికలాంగులే

చిత్తూరు: ‘అయ్యా..! నాకు 72 ఏళ్లు. ఏ పనీ చేయలేను. ఇద్దరు బిడ్డలున్నారు. వారిద్దరూ వికలాంగులే. నాకు వృద్ధాప్య పింఛన్, బిడ్డలకు ట్రైసైకిళ్లు ఇప్పిస్తామని టీడీపీ నాయకులు మోసం చేస్తున్నారయ్యా’ అంటూ వడమాలపేట మండలం ఎనుమలపాళ్యంకు చెందిన కే గురవమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తిరుమండ్యంకు చెందిన ఏ కాంతమ్మ జననేతను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. తనకు 102 ఏళ్లని, రేషన్‌ కార్డు కూడా లేదని.. పింఛన్‌ కూడా ఇవ్వడం లేదని వాపోయారు.      

Back to Top