భూమి మా పేరిట లేదంటున్నారు

చిత్తూరు:‘అయ్యా.. మాది ప్రశాకం జిల్లా తాళ్లూరు. 2005, 2009లో నాలుగెకరాల భూమిని అదే గ్రామంలోని ఓ ఆసామి వద్ద కొన్నాం. పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఇచ్చారు. భూమి సాగు చేసుకోవడానికి రుణం కోసం బ్యాంక్‌కు వెళితే అవి మా పేరిట లేవంటున్నారు.’ అంటూ నారాయణమ్మ తన కుమారుడితో కలిసి బత్తలవారిపల్లె వద్ద వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. తాళ్లూరు మండల కార్యాలయ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని జననేత తన సిబ్బందిని ఆదేశించారు.
Back to Top