మా బాధ‌లు చెప్పుకున్నాం


నెల్లూరు: `మేము చాలా దుర్భ‌ర జీవితాన్ని అనుభ‌విస్తున్నాం. ప్ర‌భుత్వం మ‌మ్మ‌ల్ని ఎవ‌రూ ప్రోత్స‌హించ‌డం లేదు. చేతిలో క‌ళ ఉన్నా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. బ్యాంకులు లోన్లు ఇవ్వ‌డం లేదు.  అందుకే మా స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చెప్పుకోవ‌డానికి వ‌చ్చాం11 అని  ఉద‌యగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చిన హ‌స్త క‌ళాకారులు అన్నారు. హ‌స్త‌క‌ళ‌ల‌ను ప్ర‌భుత్వం ప్ర‌భుత్వం ప్రోత్స‌హించ‌డం లేద‌న్నారు. తాము చెప్పుకున్న స‌మ‌స్య‌ల‌ను ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ విన్నార‌ని, తాము త‌యారు చేసిన వ‌స్తువుల‌ను చూశార‌న్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చార‌న్నారు.
Back to Top